ముద్రా రుణాలు పొందాల‌నుకుంటున్నారా? అయితే ఇవి చదవండి

చిన్న వ్యాపారులు, స్వయం ఉపాధి పొందేవారి కోసం మోడీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ముద్రా (ప్రధాన మంత్రి మైక్రో యూనిట్స్ డెవలప్‌మెంట్ రీఫైనాన్స్ ఏజెన్సీ) యోజన కింద రుణాలను అందిస్తున్న సంగతి తెలిసిందే. నిధుల కోసం కటకటలాడే చిన్న వ్యాపారులు, స్వయం ఉపాధి పొందేవారికి చేయూతనిచ్చేలా 08 ఏప్రిల్ 2015 ప్రధాని నరేంద్ర మోదీ 'ముద్ర' యోజనను ప్రారంభించారు. మైక్రో యూనిట్స్ డెవలప్‌మెంట్ అండ్ రీఫైనాన్స్ ఏజెన్సీ (ముద్ర) తక్కువ వడ్డీ రేటుకే చిన్న వ్యాపారులకు రూ. 10 లక్షల దాకా ఋణాలను అందిస్తుంది. ప్ర‌భుత్వం ఎన్ని కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నా కిందిస్థాయిలో అవ‌గాహ‌న లేని మూలంగా వాటి ప్ర‌యోజ‌నాల‌ను చిన్న, మ‌ధ్య త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌ల వ్య‌వ‌స్థాప‌కులు అందుకోలేక‌పోతున్నారు. ఈ నేప‌థ్యంలో ముద్రా యోజ‌న గురించి స‌మ‌గ్ర స‌మాచారం మీ కోసం.

ముద్రా రుణం పొందుటకు అర్హత

  • భారత పౌరుడై ఉండాలి.
  • ఒక వ్యవసాయేతర వ్యాపార ఆదాయ ప్రణాళిక సూచించే విధంగ ఉండాలి, ఉదాహరణకు తయారీ, ప్రాసెసింగ్, వ్యాపార లేదా సేవా రంగాల్లో మీ ప‌రిశ్ర‌మ‌, ఆలోచ‌న ఉండొచ్చు.
  • రుణ అవసరం రూ.10 లక్షల లోపు ఉండాలి.

మూలధనం

దేశంలో 58 మిలియన్ నాన్ కార్పొరేట్ సంస్థలు 128 మిలియన్ ఉద్యోగాలను కల్పిస్తున్నాయి. వాటిలో 60 శాతం గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నాయి. వాటిలో 40 శాతానికి పైబడి వెనుకబడిన తరగతులు, 15 శాతం షెడ్యూల్డ్ కులాలు, జాతుల పారిశ్రామికుల యాజమాన్యంలో ఉన్నాయి. కాని ఆయా సంస్థలకు బ్యాంకుల ద్వారా అందిన ఆర్థిక సహాయం నామమాత్రమే. వారిలో చాలా మందికి బ్యాంకు రుణాలు అందుబాటులో లేవు. మరో మాటలో చెప్పాలంటే, అత్యధిక ఉపాధి అవకాశాలు అందిస్తున్న రంగానికి అతి తక్కువ స్థాయిలో రుణాలు అందుబాటులో ఉన్నాయి. ఈ పరిస్థితిలో మార్పు తెచ్చేందుకు ప్రభుత్వం ప్రధానమంత్రి ముద్ర యోజన, ముద్ర బ్యాంకులను ప్రారంభించింది.

ముద్రా రుణం అంటే ఏమిటి?

వ్య‌వ‌సాయేత‌ర రంగాలైన త‌యారీ, వాణిజ్యం, సేవా రంగాల్లో రూ. 10 ల‌క్ష‌ల వ‌ర‌కూ ప్ర‌భుత్వం క‌ల్పించే రుణ‌మే ముద్రా రుణం. ఈ ర‌క‌మైన రుణాల‌ను ప్ర‌భుత్వ రంగ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, ప్ర‌యివేటు బ్యాంకులు, స‌హ‌కార బ్యాంకుల నుంచి పొంద‌వ‌చ్చు. ప్ర‌ధాన మంత్రి ముద్రా యోజ‌న కింద ఈ రుణాల‌ను అంద‌జేస్తారు.

వీటితో పాటు ఎన్‌బీఎఫ్‌సీలు, సూక్ష్మ రుణ సంస్థ‌లు సైతం రుణాల‌నందించేందుకు ప్ర‌భుత్వం అంగీక‌రించింది. అయితే ఇందుకోసం అవి కొన్ని అర్హ‌త ప్ర‌మాణాల‌ను పాటించాల్సి ఉంటుంది.

మొత్తంగా చూస్తే 27 ప్ర‌భుత్వ రంగ బ్యాంకులు, 17 ప్రైవేటు రంగ బ్యాంకులు, 27 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, 25 సూక్ష్మ రుణ సంస్థ‌ల నుంచి ల‌బ్దిదారులు రుణాల‌ను తీసుకోవ‌చ్చు.

ముద్రా రుణ రకాలు

శిశు

శిశు అని పేరు వినగానే మనకి తెలుస్తుంది ఈ ఋణము కొత్తగా వ్యాపారం పెట్టిన వారికి ఉపయోగపడుతుంది.ఈ ఋణం ఏభై వేళా రూపాయిలు ఇవ్వబడుతుంది.వడ్డీ రేటు 10-12% .

కిశోర్

ఈ ఋణము కొత్తగా వ్యాపారం పెట్టి ఋణం కోసం చూస్తున్న వారికీ ఈ ఋణం ఉపయోగపడుతుంది.ఈ ఋణం ఏభై వేళా రూపాయిలు నుంచి అయిదు లక్షలు ఋణము ఇవ్వబడుతుంది.వడ్డీ రేటు 14-17% .

తరుణ్

ఈ ఋణము కొత్తగా వ్యాపారం పెట్టి కొంత వరకు వారి వ్యాపారం విస్తరించిన వారికి ఈ ఋణం ఉపయోగపడుతుంది.ఈ ఋణం తీసుకొని ఇంకా మీ వ్యాపారం విస్తరించుకోవటానికి ఉపయోగపడుతుంది .అందుకే ఈ ఋణం పది లక్షలు రూపాయిలు ఇవ్వబడుతుంది.వడ్డీ రేటు 16% నుంచి మొదలవుతుంది.

Top <